Thursday, August 15, 2013

నది ఓ నది- a poem about rivers

నది నది
        నువ్వే ప్రపంచానికి పెన్నిధి
        నువ్వే నాగరికత కు పునాది
నది నది
       నువ్వే పంచభుతాలకు అధిపతి
       నువ్వే రైతన్న కు నిధి
నది నది
        నీ వల్ల జరిగింది పురోగతీ
      నీ వల్ల ప్రపంచానికి  వచ్చింది  ఈ  ఆకృతి
నది  నది
     నిన్ను ఎల్లప్పుడు పుజిస్తుంది భారతి
     నిన్ను సేవించకపోతే మిగిలేది చితి
నది  నది
     నీవు ప్రశాంతతకు సన్నిధి 
     నీవు ఆగ్రహిస్తే పడుతుంది అధోగతి