Thursday, August 15, 2013

నది ఓ నది- a poem about rivers

నది ఓ నది
        నువ్వే ఈ ప్రపంచానికి పెన్నిధి
        నువ్వే నాగరికత కు పునాది
నది ఓ నది
       నువ్వే పంచభుతాలకు అధిపతి
       నువ్వే రైతన్న కు ఓ నిధి
నది ఓ నది
        నీ వల్ల జరిగింది పురోగతీ
      నీ వల్ల ప్రపంచానికి  వచ్చింది  ఈ  ఆకృతి
నది ఓ నది
     నిన్ను ఎల్లప్పుడు పుజిస్తుంది భారతి
     నిన్ను సేవించకపోతే మిగిలేది చితి
నది ఓ నది
     నీవు ప్రశాంతతకు సన్నిధి 
     నీవు ఆగ్రహిస్తే పడుతుంది అధోగతి